హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి సామాజిక మాధ్యమాల్లో కీలకంగా వాడే హ్యాష్‌ట్యాగ్ (#)కు ఆగస్టు 23తో పదేళ్లు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన క్రిస్ మెస్సినా అనే సామాజిక మాధ్యమ నిపుణుడు హ్యాష్‌ట్యాగ్ విధానాన్ని రూపొందించి, తొలిసారిగా 2007 ఆగస్టు 23న ఓ ట్వీట్‌లో ‘#barcamp’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు. అప్పటి నుంచి ఇది ప్రచారంలోకి వచ్చింది. క్విక్ రివ్యూ: ఏమిటి : హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి ఎప్పుడు : ఆగస్టు 23 ఎవరు : క్రిస్ మెస్సినా ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని నేవీకి అప్పగించిన జైట్లీ హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ బీడీఎల్‌లో ఆగస్టు 28న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖమంత్రి అరుణ్ జైట్లీ.. సామ్ క్షిపణిని నావికాదళానికి అప్పగించారు. అలాగే.. బార్‌కోడ్‌తో రూపొందించిన బీఎంపీ-2 వాహనాలను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. అధునాతన ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని బీడీఎల్, మిథాని సంయుక్తంగా రూపొందించాయి. పటాన్‌చెరులోని బీడీఎల్ పరిశ్రమలో అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను జైట్లీ ప్రారంభించారు. క్విక్ రివ్యూ: ఏమిటి : ఎల్‌ఆర్ సామ్ క్షిపణి నేవీకి అప్పగింత ఎప్పుడు : ఆగస్టు 28 ఎవరు : రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎక్కడ : హైదరాబాద్‌లో జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న ఉత్తర కొరియా ఆగస్టు 29న జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని సునన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి జపాన్ మీదుగా ప్రయాణించి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో పడింది. 2,700 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షిపణి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై జపాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా క్షిపణి ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున.. ఉత్తర కొరియాపై ఒత్తిడిని తీవ్రతరం చేసేలా అమెరికా, జపాన్‌లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐక్యరాజ్యసమితిని కోరాయి. క్విక్ రివ్యూ: ఏమిటి : జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి ఎప్పుడు : ఆగస్టు 29 ఎవరు : ఉత్తర కొరియా సైన్యానికి బోయింగ్ అపాచీ హెలికాప్టర్లు

No comments:
Post a Comment