ఆగస్టు 2017 స్పోర్ట్స్
ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత తాను రిటైరవుతున్నట్లు ప్రకటించిన జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. ఈ మేరకు ఆగస్టు 1న బోల్ట్ తల్లిదండ్రులు వెల్లెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ ఈ బూట్లను అతనికి అందజేశారు.
ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి.
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 4న జరగనున్న రేసు బోల్ట్ కెరీర్‌లో చివరి పరుగుపందెం.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకి ప్రత్యేక బూట్లు
ఎప్పుడు : ఆగస్టు 4
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్
నెమార్ కోసం 1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీ
బ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెమార్ జూనియర్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్-జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్ జట్టు భారీ మొత్తం చెల్లించింది. ప్రొఫెషనల్ లీగ్‌సలో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెమార్ ఇక నుంచి పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెమార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది. అయితే నెమార్‌ను ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ.1,661 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది. 2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెమార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. దీంతో ఇది ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీగా నిలిచింది.

ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీ
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : నెమార్ కోసం రూ.1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీ
ఎందుకు : బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్-జెర్మయిన్ జట్టుకి బదిలీ కోసం
ఆసియా షాట్‌గన్ షూటింగ్‌లో అంకుర్‌కు స్వర్ణం
ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ-70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్‌షమ్సీ (యూఏఈ-53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు.

ఏమిటి : ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్‌కు స్వర్ణం
ఎక్కడ : ఆస్తానా, కజకిస్తాన్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫరాకు స్వర్ణం
లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా స్వర్ణం సాధించాడు. ఆగస్టు 5న జరిగిన పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో వరుసగా మూడో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.

ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : పురుషుల 10 వేల మీటర్ల రేసులో మొహమ్మాద్ ఫరాకు స్వర్ణం
ఎక్కడ : లండన్
డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ విజేత విజేందర్
భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో ఆగస్టు 5న జరిగిన బౌట్‌లో 3-0తో విజయం సాధించాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను విజేందర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం.

ఏమిటి : డబ్ల్యూబీవో టైటిల్ పోరు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : విజేత విజేందర్ సింగ్
ఎందుకు : చైనా బాక్సర్ జుల్పికర్ మైమైటియాలిని ఓడించిన విజేందర్(3-0 తేడాతో).
చివరి 100 మీటర్ల రేసులో బోల్ట్‌కు కాంస్యం
జమైకా దిగ్గజం ఉసేన్ బోల్డ్ తన చివరి 100 మీటర్ల రేసులో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసులో ఉసేన్ బోల్డ్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలువగా... క్రిస్టియన్ కోల్మన్ 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు.
బోల్ట్ రికార్డులు
ఒలింపిక్స్ (2008, 2012, 2016): 8 స్వర్ణాలు
ప్రపంచ చాంపియన్‌షిప్ (2007, 2009, 2011, 2013, 2015, 2017): 11 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం
ఇతర అంతర్జాతీయ పతకాలు: 4 స్వర్ణాలు, 3 రజతాలు
బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు
100 మీ. పరుగు: 9.58 సెకన్లు
200 మీ. పరుగు: 19.19 సెకన్లు
4×100 మీ. రిలే: 36.84 సెకన్లు (జమైకా జట్టులో సభ్యుడు)

ఏమిటి : ఉసేన్ బోల్డ్ చివరి 100 మీటర్ల రేసు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టోరి బోవికి స్వర్ణం
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన అథ్లెట్ టోరి బోవీ స్వర్ణం సాధించింది. ఆగస్టు 7న జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో ఆమె 10.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఫేవరేట్ ఎలైన్ థాంప్సన్ (జమైకా) 5వ స్థానంలో నిలిచింది. ఐవరీ కోస్ట్‌కు చెందిన మారి జోన్ రజతం, నెదర్లాండ్స్‌కు చెందిన షిప్పర్స్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
పురుషుల షాట్‌పుట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన థామస్ వాల్ష్ గుండును 22.02 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.

ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల విజేత
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : టోరి బోవి (అమెరికా)
ఎక్కడ : లండన్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు స్వర్ణం
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్ రోజస్ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్-14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు.

ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో వెనిజులాకు తొలి స్వర్ణం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ట్రిపుల్ జంప్‌లో యులీమార్ రోజస్‌కు స్వర్ణం
ఎక్కడ : లండన్
టెస్టుల్లో ఆల్‌రౌండర్ గా జడేజా
ఆగస్టు 8న విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్‌స ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా అగ్రస్థానం అందుకున్నాడు. జడేజా 438 పాయింట్లతో తొలిస్థానం కైవసం చేసుకోగా ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న షకీబ్ ఉల్ హసన్ (బంగ్లాదేశ్) 431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్‌సలోనూ జడేజా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌సలో పుజారా (888 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (813 పాయింట్లు) ఐదో స్థానంలో, రహానే (776 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్) వరుసగా తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.

ఏమిటి : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
ఎప్పుడు : ఆగస్ట్ 8
ఎవరు : ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో జడేజా
No comments:
Post a Comment