Sep2017 national current affairs - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Friday, 29 September 2017

Sep2017 national current affairs

రహదారి ప్రమాదాల్లో రోజుకు 400 మందికి పైగా మృతిదేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 400 మందికి పైగా మరణిస్తున్నారు. ఇందులో సగానికిపైగా 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు వారే. ఈ మేరకు ‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు - 2016’ తాజా నివేదికను రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ సెప్టెంబర్ 6న విడుదల చేశారు. 
ఈ నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 4.1 శాతం మేర తగ్గింది. మొత్తంగా గత ఏడాది 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1,50,785 మంది ప్రాణాలు కోల్పోగా, 4,94,624 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 భారత్‌లో రోడ్డు ప్రమాదాలు - 2016 నివేదిక
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ
ఎందుకు : దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో రోజుకి 400 మందికిపైగా మృతి

1993 ముంబై పేలుళ్ల కేసు దోషులకు శిక్ష ఖరారు 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక టాడా కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ దారుణ మారణకాండలో క్రియాశీలకంగా వ్యవహరించిన.. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్‌లకు మరణశిక్ష, గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. కుట్రలో భాగస్వాములైన కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఫిరోజ్ ఖాన్‌కు రూ. 4.75 లక్షలు, కరీముల్లా ఖాన్‌కు రూ. 8.88 లక్షలు, తాహిర్ మర్చంట్‌కు రూ. 4.85 లక్షలు, అబూ సలేంకు రూ. 8.51 లక్షలు, రియాజ్ సిద్దిఖీకి రూ. 10వేల జరిమానా విధించింది. 
అసలేం జరిగింది? 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చేశారు. దీనికి ప్రతీకారంగా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం అనుచరులు వ్యూహం రచించారు. 1993 మార్చి12న ముంబైలో ఆర్డీఎక్స్ సాయంతో పలుచోట్ల భారీ విధ్వంసం సృష్టించారు. 13చోట్ల బాంబులను పేల్చారు. ఈ మారణకాండలో 257 మంది మృతి చెందగా.. 700 మందికి గాయాలయ్యాయి. 

విమానాల్లో 'నో ఫ్లై' జాబితా మార్గదర్శకాలు విమానయాన సంస్థల సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై మూడు నెలల నుంచి జీవిత కాలంపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలిసారిగా ‘నో ఫ్లై’ జాబితాకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్ప్రవర్తన లేని ప్రయాణికుల జాబితాను సిద్ధం చేసింది. ప్రయాణికుల దురుసు ప్రవర్తనను మూడు రకాలుగా విభజించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ... తీవ్రతను బట్టి ఒక్కోదానికి ఒక్కో కాలపరిమితిగల శిక్షను ఖరారు చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో.. భద్రతా ప్రమాణాల్లో భాగంగా ప్రపంచంలో ‘నో ఫ్లై’జాబితా రూపొందిస్తున్న మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. 
ముఖ్య మార్గదర్శకాలు..
  • ప్రయాణికుడిపై విమాన పైలట్ ఇన్ కమాండ్ ఫిర్యాదు చేయవచ్చు. సదరు సంస్థ అంతర్గత కమిటీ దీనిపై 30 రోజుల్లోగా విచారణ జరపాలి.
  • ఒకవేళ ఈ గడువు లోగా దర్యాప్తు పూర్తికాకపోతే సదరు ప్రయాణికుడు విమానాల్లో విహరించవచ్చు.
  • దుష్ప్రవర్తన తీవ్రతను బట్టి ఎంత కాలం నిషేధం విధించాలన్నది కమిటీ నిర్ణయిస్తుంది.
  • ప్రయాణికుడిపై తీసుకున్న చర్యలను విమానయాన సంస్థ కేంద్రానికి తెలపాలి
  • హోంశాఖ సూచన మేరకు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ప్రయాణికుల పేర్లను కూడా ‘నో ఫ్లై’జాబితాలో చేర్చాలి.
  • ఈ నిబంధనలు అన్ని దేశీయ, విదేశీ విమాన సేవలకు, అన్ని విమానాశ్రయాలకూ వర్తిస్తాయి. అయితే ఓ దేశీయ విమానయాన సంస్థ ‘నో ఫ్లై’జాబితాకు ఇతర సంస్థలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక సంస్థ నిషేధించిన ప్రయాణికుడి విషయంలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఇతర విమాన సంస్థలకు ఉంటుంది.
3 రకాల నిషేధాలివే...
దూషణ:
 మూడు నెలల నిషేధం (తిట్టడం, మాటలతో వేధించడం, మద్యం సేవించి ఇబ్బంది కలిగించడం వంటివి) 
భౌతిక దాడి: ఆరు నెలల నిషేధం (తొయ్యడం, కొట్టడం, అసభ్య ప్రవర్తన) 
బెదిరించడం: రెండేళ్ల నుంచి జీవిత కాల నిషేధం (దీన్ని తీవ్రమైన చర్యగా భావిస్తారు. చంపుతానని బెదిరించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి) 
- నిషేధంపై ప్రయాణికుడు 60 రోజుల్లోగా మంత్రిత్వ శాఖ అప్పిలేట్ కమిటీని సంప్రదించవచ్చు. ఒకవేళ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు. 

మిలటరీ పోలీసులుగా మహిళలుఆర్మీలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు సెప్టెంబర్ 8న రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏడాదికి 52 మంది చొప్పున దాదాపు 800 మంది మహిళల్ని సైన్యంలో పోలీసులుగా నియమించనున్నారు. ఆర్మీలో పోలీసులుగా చేరిన మహిళల్లో కొందరిని కశ్మీర్ లోయకు కేటాయిస్తారు. స్థానిక మహిళలను తనిఖీ చేయడం సహా పలు విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. 
సెన్యంలో లింగభేదాలు తొలగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : భారత సైన్యంలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రక్షణ శాఖ

‘ఆధార్’ లేని సిమ్‌లు రద్దు ఆధార్‌తో అనుసంధానమవని సిమ్ కార్డులను ఫిబ్రవరి 2018 తర్వాత రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి సిమ్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలని, ఏడాదిలోగా దీన్ని అమలు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత అనుసంధానం పూర్తికాని మొబైల్ సిమ్‌కార్డులను రద్దుచేయాలని భావిస్తోంది. దీని ద్వారా నేరస్తులు, ఉగ్రవాదులు, మోసగాళ్లు సిమ్‌కార్డులను వినియోగించేందుకు వీలుండదు.

న్యూఢిల్లీలో యంగ్ ఇండియా న్యూ ఇండియా సదస్సు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తయిన సందర్భాలని పురస్కరించుకొని.. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 11న ' Young India New India - Resurgent Nation. From Sankalp to Siddi ' పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 125 ఏళ్ల క్రితం 9/11 (సెప్టెంబర్ 11)న చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుని ఉంటే.. 16 ఏళ్ల క్రితం అమెరికాలో 9/11 ఘటన (డబ్ల్యూటీసీ టవర్ల కూల్చి వేత తదితర ఉగ్ర విధ్వంసం) చోటు చేసుకునేది కాదని అన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : యంగ్ ఇండియా న్యూ ఇండియా సదస్సు 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ 
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు : పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తయిన సందర్భాలని పురస్కరించుకొని 

కుంభమేళాపై ఇండస్ విశ్వవిద్యాలయం డాక్యుమెంటరీ 
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన కుంభమేళా ఇతివృత్తంపై అహ్మదాబాద్‌లోని ఇండస్ విశ్వవిద్యాలయం రూపొందించిన డాక్యుమెంటరీని... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 11న ఆవిష్కరించారు. భారతదేశ చరిత్ర, సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. 
దేశంలోని పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతాల్లో 12 ఏళ్లకోసారి కుంభమేళా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నాసిక్, ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వార్‌లలో ఈ ఉత్సవం జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్‌లో మహా కుంభమేళా జరుగుతుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కుంభమేళా ఇతివృత్తంపై డాక్యుమెంటరీ 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఇండస్ విశ్వవిద్యాలయం
ఎక్కడ : అహ్మదాబాద్ 

కెంట్ ఆర్‌వో లఘుచిత్రం ఆవిష్కరణఅద్భుతమైన కశ్మీర్ లోయ అందాలను వివరిస్తూ ‘కెంట్ ఆర్‌వో’ సంస్థ రూపొందించిన వాదీ-ఏ-కశ్మీర్ లఘుచిత్రాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 11న ఆవిష్కరించారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్‌ను భారత్ తరఫున రాజ్‌నాథ్ కశ్మీర్‌కు అంకితమిచ్చారు.
కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా ‘లా అండ్ కెన్నెత్ సాచీ అండ్ సాచీ’ సంస్థ ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది. ఆరు నిమిషాల నిడివిగల ఈ చిత్రంలో కశ్మీరీల ఆప్యాయతతోపాటు, కెంట్ ఆర్‌వోలాగా కశ్మీరీలతో అన్ని రాష్ట్రాలవారి స్వచ్ఛమైన ప్రేమానుబంధాలను చూపించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కెంట్ ఆర్‌వో రూపొందించిన వాదీ-ఏ-కశ్మీర్ లఘుచిత్రం ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 
ఎందుకు : కశ్మీర్ లోయ అందాలను వివరించేందుకు

విడాకులకు ఆర్నెల్ల విరామం అక్కర్లేదుదంపతులకు విడాకులు మంజూరు చేసేముందు.. పునరాలోచనకు అవకాశం కల్పించేందుకు కనీసం ఆర్నెల్ల సమయం ఇచ్చే నిబంధనను ఇకపై ట్రయల్ కోర్టులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని వచ్చిన దంపతులకు.. వారి మధ్య సయోధ్యకు అవకాశం లేదని విచారణ కోర్టు భావిస్తే.. ఆ నిబంధనను పాటించకుండానే విడాకులు మంజూరు చేయొచ్చని సెప్టెంబర్ 12న పేర్కొంది. 
హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం.. విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలైన తరువాత.. తదుపరి విచారణకు కనీసం ఆర్నెల్ల విరామం ఉండాలి. అయితే, ఆ చట్టంలో ఈ నిబంధన ఉన్న సెక్షన్ 13బీ(2)ను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, అది సలహాపూర్వకమైనది మాత్రమేనని, దంపతులిద్దరూ తిరిగి కలిసే అవకాశాల్లేవని విచారణ కోర్టు భావిస్తే.. తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది.

యుద్ధ విధుల్లోకి ఆర్మీ సివిల్ సిబ్బంది సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా ఆర్మీలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టనున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 30న వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్మీలో సివిల్ విధులు నిర్వహిస్తున్న 57,000 మంది అధికారులు, జూనియర్ కమిషన్‌‌డ అధికారులను యుద్ధ విధుల్లోకి తీసుకోనున్నారు. 
ఆర్మీలో నిర్మాణాత్మక సంస్కరణల కోసం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకత్కర్ కమిటీ సమర్పించిన నివేదికలోని 99 సిఫార్సుల్లో 65 అంశాలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. 2019, డిసెంబర్ 31 నాటికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 39 సైనిక క్షేత్రాలను దశల వారీగా మూసివేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

పశ్చిమబెంగాల్ గోవిందోభాగ్ వరికి జీఐ గుర్తింపు Current Affairs పశ్చిమబెంగాల్ బుర్ద్వాన్ జిల్లాలో పండే గోవిందోభాగ్ రకం వరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. ఈ మేరకు ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ (GIR) ఆగస్టు 30న ప్రకటించింది. గోబిందోభాగ్ రకం వరికి జీఐ ట్యాగ్ కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 2015లో జీఐఆర్‌కు దరఖాస్తు చేసింది.
ఉత్పత్తి, తయారీ పరంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ప్రత్యేక గుర్తింపు సాధించిన ఉత్పత్తులకు జీఐఆర్ జీఐ ట్యాగ్ ఇస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోవిందోభాగ్ వరికి జీఐ ట్యాగ్
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : జీఐఆర్
ఎక్కడ : బుర్ద్వాన్, పశ్చిమబెంగాల్ 

బోఫోర్స్‌పై పునర్విచారణకు సుప్రీంకోర్టు అంగీకారందేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోఫోర్స్ కుంభకోణం కేసును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 30 తర్వాత కేసు విచారణ చేపట్టనుంది.
విచారణలో భాగంగా 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోదీ.. హిందూజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్‌చంద్‌తో పాటు బోఫోర్స్ కంపెనీపై అభియోగాలను కొట్టేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 90 రోజుల గడువులోగా అప్పీలు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో 2005 అక్టోబర్ 18న బీజేపీ సీనియర్ నేత అజయ్ కుమార్ అగర్వాల్ సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
బోఫోర్స్ కుంభకోణం నేపథ్యం400 అత్యాధునిక తుపాకుల సరఫరా కోసం స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్, భారత ప్రభుత్వం మధ్య 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కోసం భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు బోఫోర్స్ భారీ ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో ప్రకటించింది. దీంతో 1990 జనవరిలో సీబీఐ అప్పటి బోఫోర్స్ ప్రెసిడెంట్ మార్టిన్ ఆర్డ్‌బో, మధ్యవర్తి విన్ చద్దా, హిందూజా సోదరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బోఫోర్స్ కుంభకోణం కేసు పునర్విచారణకు అంగీకారం 
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : సుప్రీంకోర్టు

కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిమండలిని పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్ హోదా ప్రమోషన్ లభించగా.. కొత్తగా తొమ్మిది మంది సహాయ మంత్రులుగా సెప్టెంబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు మొత్తం మంత్రుల సంఖ్య 75(మోదీ కాకుండా)కి చేరింది.
కొత్తగా ప్రమోషన్ పొందిన మంత్రుల్లో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్‌కు పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి.. పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖలు దక్కాయి. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. 
కేబినెట్ హోదా పొందిన మంత్రులు నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ 
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి 
పీయూష్ గోయల్ - రైల్వే శాఖ 
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాలు 
కొత్త మంత్రుల శాఖలు రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక శక్తి (స్వతంత్ర) 
హర్‌దీప్ సింగ్ పురీ - గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి (స్వతంత్ర) 
అల్ఫోన్‌‌స కణ్ణాంథనం - పర్యాటకం, ఎలక్ట్రానిక్స్ (స్వతంత్ర) 
అశ్విని కుమార్ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం (సహాయ) 
వీరేంద్ర కుమార్ - మహిళా, శిశు సంక్షేమ శాఖ (సహాయ) 
సత్యపాల్ సింగ్ - మానవ వనరుల అభివృద్ధి శాఖ, జల వనరుల శాఖ, నదుల అభివృద్ధి (సహాయ) 
గజేంద్ర షెకావత్ - వ్యవసాయం, రైతు సంక్షేమం (సహాయ) 
శివ ప్రతాప్ శుక్లా - ఆర్థిక శాఖ (సహాయ)
అనంత్‌కుమార్ హెగ్డే - నైపుణ్యాభివృద్ధి (సహాయ)

పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు దేశంలో, విదేశాల్లో భారతీయుల నల్లధనం వివరాలపై మూడు అధ్యయన నివేదికల్ని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపింది. నల్లధనం వివరాల అంచనా బాధ్యతల్ని యూపీఏ హయాంలో మూడు సంస్థలకు అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్‌‌స అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ ఫరీదాబాద్‌లు నల్లధనం లెక్కల్ని రూపొందించి 2013, 2014ల్లో ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదికల్నే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం పంపింది. భారత్‌లో నల్లధనంపై ప్రభుత్వం తరఫున ఇంతవరకూ అధికారిక నివేదికల్లేవు. 
అమెరికా సంస్థ జీఎఫ్‌ఐ అధ్యయనం ప్రకారం 2005-14 మధ్య రూ.48.28 లక్షల కోట్ల నల్లధనం భారత్‌లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ-ఢీల్లీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్-ఫరీదాబాద్

నల్లధనంపై ఎలాంటి సమాచారం లేదు : ఆర్‌బీఐపెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా చలామణీ నుంచి ఎంత మేర నల్లధనం తొలగిపోయింది అనే విషయంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదే విధంగా లెక్కల్లో చూపని ఎంత ధనం చట్టబద్ధంగా ఖాతాల్లోకి వచ్చిందన్న వివరాలు లేవని పేర్కొంది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుపై స్థాయీ సంఘం లేవనెత్తిన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ తాజాగా రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
డీమోనిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లోకి జమయిన పెద్ద నోట్ల విలువ సుమారు రూ. 15.28 లక్షల కోట్లు ఉంటుందని, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, చైనా నిర్ణయం 73 రోజులుగా భారత్-చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్య, ఇతర సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 5న సమావేశమైన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. డోక్లాం వంటి సమస్యలు మళ్లీ ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచకుండా భద్రతా బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని నిర్ణయించారు. 
నిర్మాణాత్మక సంబంధాలపై.. భారత్-చైనా దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించేలా సంయుక్త ఆర్థిక, భద్రత, వ్యూహాత్మక బృందాల ఏర్పాటుపైనా మోదీ-జిన్‌పింగ్ చర్చించారు. రక్షణ, భద్రతా బలగాలు బలమైన సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇటీవల జరిగిన పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడాలని సమావేశంలో నిర్ణయించారు. పంచశీల శాంతి సూత్రాలు, పరస్పర రాజకీయ విశ్వాసం, పరస్పర ప్రయోజన సహకారం, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, చైనా నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 5 
ఎవరు : ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 
ఎక్కడ : చైనా 

‘క్రీమీలేయర్’లోకి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఓబీసీల్లోని సంపన్న వర్గమైన క్రీమీలేయర్ పరిధి విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 30న ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లోని కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయి. దీనివల్ల ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌కు దూరమవుతారు.

No comments:

Post a Comment