మండలంలోని గత్తుం పంచాయతీ కేంద్రానికి చెందిన గత్తుం శేషగిరినాయుడు అనే గిరిజన యువకుడు గ్రూప్-2లో ఎస్టీ కేటగిరిలో 3వ ర్యాంకు సాధించి ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు ఎంపికయ్యాడు. దీంతో స్థానిక సర్పంచ్, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మిఠాయిలు తినిపించారు. ఆయన మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మజ్జివలస పాఠశాలలో, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సూకూరు ఆశ్రమ పాఠశాలలో విద్యానభ్యసించాడు. ఇంటర్ ఎస్.కోటలో, ఇంజనీరింగ్ గీతం కళాశాల విశాఖపట్నంలో చదువుకున్నాడు. ఈయన సివిల్ సర్వీసు పరీక్షలకు ప్రాధాన్యతతో కృషి చేశానన్నారు. గ్రూప్-2 ఎగ్జిక్యూటీవ్ శాఖలో ఉద్యోగం వచ్చిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు వున్నా ఎంతో శ్రమించి తల్లిదండ్రులు తనకు చదివించారన్నారు
Monday, 23 April 2018

గ్రూప్-2లో పోస్టుకు గిరిజన యువకుడి ఎంపిక
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment