పరీక్షలకు ముందు కొందరికి రాత్రిళ్లు తొందరగా నిద్ర పట్టదు. పొద్దున ఆలస్యంగా నిద్ర లేస్తారు. దానివల్ల మరుసటి రోజు రాత్రి నిద్ర పట్టదు. దీన్ని మానటం కోసం ఆలారం మంచానికి దూరంగా పెట్టుకోండి. దాని పక్కనేుగ్లాసుతో నీళ్లు ఉంచుకోండి. తెల్లవారి అలారం వెూగగానే గడియూరం వరకు నడిచి వెళ్లి, అక్కడ నీళ్ల తో మెుహం తడిచేసుకోవడం తద్వారా మత్తు నుంచి బయుటకు రండి. పగలు ఎంత నిద్ర వచ్చినా ఆ రోజు రాత్రి వరకూ పడుకోకుండా ఏదైనా వ్యాపకం కల్పించుకోండి. అయిదు రోజుల్లో వీు నిద్ర గాడిలో పడుతుంది.
- ఉదయం లేవగానే అద్దంలో అయిదు సెకన్లు మీ మొహాన్ని చూసుకుంటూ సన్నగా నవ్వండి. నవ్వినప్పుడు మెదడులో ‘సెరొటిన్’ అనే రసాయనం విడుదల అవుతుంది. అది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఉదయం లేవగానే ‘జగమే మాయ.... బతుకే మాయ’ లాంటి మాటలు విన్నా, ఇంట్లో వారితో గొడవ పడినా రోజంతా డల్‌గా ఉంటుంది.
- టెన్షన్ వల్ల ‘కార్టిజాల్’ అనే కెమికల్ విడుదల అవుతుంది. అది పొరపాటు చెయ్యడానికి దారి తీస్తుంది. టెన్షన్ వల్ల విడుదలయ్యే ‘కార్టిజాల్’కి వ్యతిరేకంగా పనిచేసే ఒకే ఒక మందు‘సెరొటొనిన్’. అది చిరునవ్వుతో వస్తుంది. అందువల్ల పరీక్ష రాసేటప్పుడూ, ఇంటర్వ్యూ సమయంలోనూ చిరునవ్వుతో ఉండాలి. నిద్రలేవగానే నవ్వమనేది కూడా అందుకే! మీ స్నేహితుడిని తొందరగా సమాధానం చెప్పమని ఈ ప్రశ్న అడగండి ‘‘నువ్వు బ్యాచిలరా?అన్ మ్యారీడా?’’అని. అతను కంగార్లో ‘‘బ్యాచిలర్’’ అని సమాధానం చెప్తాడు. కరెక్ట్‌గా అయితే రెండూ అని చెప్పాలి.
- తెల్లవారుజాముని ‘బ్రహ్మ సమయం’ అంటారు. అప్పుడు సాధారణంగా మర్చిపోవడం జరగదు. అయితే కొందరు స్నానం చెయ్యకుండా చదువు ప్రారంభిస్తారు. అది తప్పు. స్నానం చేసి అరుదు నిమిషాలు ప్రార్థన చేసి చదవడం మొదలు పెడితే, బ్రహ్మ సమయంలో ఏకాగ్రత బ్రహ్మాండంగా ఉంటుంది.
- ఉదయం లేవగానే టేప్‌లో ఏదైనా ఉదయరాగాన్ని (భూపాల, మలయమారుతం లాంటివి) వింటూ కాలకృత్యాలు పూర్తి చెయ్యాలి. అన్నిటి కంటే సుప్రభాతం వినడం బెస్ట్! స్నానం పూర్తి చేసే వరకూ ఎవరితోనూ మాట్లాడకుండా ఈ విధంగా చేస్తే, దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది.
- కరాటే ఆటగాడు పోటీలోకి ప్రవేశించబోయే ముందు ఏ విధంగా గాలిలోకి పంచ్‌లు ఇస్తూ, బలంగా ఊపిరితీస్తూ ‘మూడ్’లోకి ప్రవేశిస్తాడో...ఆ విధంగా చదువు ప్రారంభానికి ముందు నిమిషం సేపు కళ్లు మూసుకుని బలంగా ఊపిరి పీలుస్తూ వదలండి. దీన్నే ‘క్లీనింగ్ ద మైండ్ స్లేట్’ అంటారు. మొదట్లో కష్టంగా ఉంటుంది. అలవాటు అయ్యేకొద్దీ ఫలితం కనిపిస్తుంది.
- గది తలుపలు వేసుకోండి. చదువు బోర్ కొట్టినప్పుడు లేచి, గదిలోనే పచార్లు చేయండి.‘నడవడం కంటే చదవడమే బావుంది’ అని అనిపించినప్పుడు తిరిగి కూర్చొని చదవండి.
- ఒక పనిని ప్రారంభించడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. వీటిని ఇంగ్లి్‌షలో ‘రోడ్ బ్లాక్స్’ అంటారు. చదువుకి ముందు తలనొప్పిగా అనిపించడం, ఇంకేదో పని దాని కంటే ముందు చెయ్యాలనిపించడం, గది వేడిగా ఉందన్న ఇబ్బంది...ఇవన్నీ ఉదాహరణలు. వీటిని ఎంత త్వరగా నిర్మూలించగలిగితే అంత మంచిది. చదివే టైం దగ్గర పడేకొద్దీ దాన్ని ఎలా వాయిదా వెయ్యాలా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన విషయాలతో ప్రారంభించి, సబ్జెక్టులోకి రావటం అన్నమాట!
- గడువుకు ముందే చదవాలనుకున్నదంతా అయిపోతే ఆ రాత్రి ఎంత హాయిగా నిద్ర పోవచ్చో ఒకసారి అనుభవంలోకి వస్తే ఇక మీరు ఆ అలవాటును వదలరు. కొందరు విద్యార్థులు కళ్లార్పకుండా రుషుల్లా పుస్తకాల్లోకి చూస్తూ ఉంటారు. కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. కాగితం, కలంతో కూర్చుంటారు కానీ ఒక్క అక్షరం రాయరు. దీన్నే ‘డ్వాడ్లింగ్’ అంటారు. పోనీ ఆవిధంగా ఆనందంగా ఉంటారా అంటే అదీ లేదు. ‘చదువుపై మనసు నిలవటంలేదే’ అని బాధ పడుతూనే ఉంటారు. ఈ రోజు అనుకున్నది మొత్తం చదివేస్తే, మరుసటి రోజు సినిమా, హోటల్...ఏది ఇష్టమైతే దానికి వెళ్తాను అనుకోవాలి. అనుకున్న చదువు పూర్తయ్యే వరకూ వెళ్లకూడదు.
- చదివే స్థలాన్ని మార్చొద్దు, పక్కమీద పడుకొని చదవొద్దు. మరీ మార్పు కావాలంటే మేడపైకి వెళ్లి చదవండి. వీలైనంత వరకూ ఒంటరిగా చదవండి. కంబైన్డ్ చదువు ఉషారుగానే ఉంటుంది కానీ, కబుర్లకి దారితీయవచ్చు.
- చదువుకునే గదిలో ప్రపంచపటం, దేశపటం, రాష్ట్రపటం తగిలించుకుంటే చదవటం బోరుకొట్టినప్పుడల్లా వాటిని చూస్తూ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది. దేశాలు, ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో కష్టమైన సూత్రాలు కూడా గోడకి అతికించుకుంటే, తరచూ వాటిని చూస్తూ ఉండవచ్చు. దీనివల్ల ఆ ఆ సూత్రాలను మరచిపోయే అవకాశం ఉండదు.
- చదువు మధ్యలో ఒక సారి పంచదార కలపని పళ్లరసం, గంట తరవాత సోయాబీన్ పౌడర్ కలిపిన మజ్జిగ, చెరోగ్లాసు తాగితే నిద్ర రాకుండా శక్తి వస్తుంది. పుదీనా వాసన మెదడుని ఉత్తేజపరుస్తుంది. చదవు ప్రారంభానికి ముందు పుదీనా వాసన గుండెల్నిండా పీల్చడం వల్ల ప్రెష్‌గా ఉంటుంది. అదేవిధంగా చదువు ప్రారంభానికి ముందు ఒక అగరొత్తి వెలిగించండి. ఆ వాసనకీ, ఏకాగ్రతకీ మధ్య కొద్ది వ్యవధిలోనే లింక్ ఏర్పడుతుంది. ఆ వాసన పీల్చగానే ఆటోమెటిక్‌గా చదువుకోవాలనిపిస్తుంది.
- చదువు పట్ల ఆసక్తిని పెంచి, దాని ద్వారా ఏకాగ్రత సాధించగలిగే మొట్టమొదటి సూత్రం...వీలైనంత సేపు, అవసరం లేనప్పుడు, మౌనంగా ఉండగలగడం. ఇదే కచ్చితమైన, ఏకైక మార్గం! చదివింది మాటి మాటికీ గుర్తుకు తెచ్చుకోండి. స్నానం చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, చదివినదాన్ని గుర్తుచేసుకోవాలి.
- పరీక్షల ముందు ఇచ్చే సెలవుల్లో మధ్యాహ్నం రెండు గంటల సేపు నిద్రపోండి. లేచి మళ్లీ బ్రష్ చేసుకుని, స్నానం చేసి చదవండి. అప్పుడు ఉదయం ఉన్నట్టు ఫ్రెష్‌గా ఉంటుంది. పరీక్షల ముందు ఎం చదవాలా? ఎలా రివైజ్ చెయ్యాలా? అని కంగారు పడవద్దు. పరీక్షలకు వారం రోజుల ముందే టైం టేబుల్ వేసుకుంటే టెన్షన్ ఉండదు. ఒకే సబ్జెక్టుని ఎక్కువసేపు రివైజ్ చెయ్యొద్దు. రివిజన్ అంటే చదువుకుంటూ పొవడం కాదు. గుర్తుంచుకోవడం.
- రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొద్ది సేపు పునశ్చరణ చేసుకొని టీవీ చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా వెంటనే నిద్రపోండి.
- టీవీ చూస్తూ డిన్నర్ చేయకండి.
- పరీక్షలో మొదట ప్రశ్న పత్రం పూర్తిగా చదవండి. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఆ తరవాతే ప్రశ్నలకు సమాధానాలు రాయడం మొదలు పెట్టండి. ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి వదలండి. వీలైతే చల్లటి నీటితో ముఖాన్ని తడుపుకోండి.
- పరీక్ష అయ్యాక ఆ పేపరు గురించి చర్చించవద్దు. సరిగా రాస్తే మార్కులు వస్తాయి. రాయకపోతే రావు. దాని గురించి స్నేహితులతో మాట్లాడితే ఏ లాభమూ ఉండదు. రిక్షాలో, ఆటోలో, పరీక్ష హాలు ముందు, ఆఖరి నిమిషంలో చదవద్దు. పరీక్షకు కొత్త పెన్ వాడవద్దు. ప్రాక్టీస్ అయిన కలంతోనే రాయండి. పరీక్ష పేపరు పూర్తిగా మొత్తం చదివిన తర్వాతే, జవాబులు రాయడం ప్రారంభించండి.
సూపర్ సతీష్....tnq
ReplyDelete