10వ తేదీ నుంచి 22 వరకు మూడు కాదు.. 4 పేపర్లు
పీఈటీ పోస్టులకు నాలుగో పేపర్
పాఠశాల విద్యా కమిషనర్ ప్రతిపాదన
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను మరోసారి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జూన్ 10వతేదీ నుంచి నిర్వహించేలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ‘టెట్’లో మూడు పేపర్లుండగా.. ఈ సారి నాలుగు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) పోస్టుల కోసం పేపర్-1, స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పోస్టుల కోసం పేపర్-2, లాంగ్వేజ్ పండిట్(ఎల్‌పీ) పోస్టుల కోసం పేపర్-3, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) కోసం పేపర్-4 నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. జూన్ 10 నుంచి 22 వరకు నిర్వహించనున్న టెట్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.
No comments:
Post a Comment