గ్రూప్-1, గ్రూప్-2లో ఉద్యోగాలకు మొదటి ప్రయత్నంలోనే.. - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Monday, 23 April 2018

గ్రూప్-1, గ్రూప్-2లో ఉద్యోగాలకు మొదటి ప్రయత్నంలోనే..


నాదంతా స్వీయ శిక్షణ: సీహెచ్‌ ఆలోచన

పేరు : సీహెచ్‌ ఆలోచన
తండ్రి : సీహెచ్‌ జాషువా
తల్లి : కృపావరమ్మ
తమ్ముడు : అన్వేష్‌
ఊరు: నెల్లూరులోని కొండాయపాళెం
అమ్మా నాన్నలిద్దరూ ఉపాధ్యాయులు. చిన్నతనం నుంచి దేశంలో జరిగే ప్రతి విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తూ ఉండేవారు. నాన్న చేస్తున్న ఎన్నో పోరాటాలను చూస్తూ పెరిగాను. వాటిలో ప్రధానమైనది లిక్కర్‌ మూమెంట్‌. ఈ నేపథ్యంలో చిన్నతనంలోనే మంచి అధికారిగా ప్రజలకు సేవలందించాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దానిని సాధించేందుకు నిరంతరం శ్రమించేదాన్ని. 2007లో పదో తరగతిలో 536 మార్కులు, ఇంటర్‌లో ఎంపీసీలో 937 మార్కులు సాధించి జేఎన్‌టీయూ అనంతపురంలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ఆ వెంటనే ఢిల్లీలో వాజీరామ్‌ కోచింగ్‌ సెంటర్‌లో సివిల్‌ సర్వీస్‌కు శిక్షణ తీసుకున్నాను. గ్రూపు -1, గ్రూపు -2 నోటిఫికేషన్‌ విడుదల కావడంతో హైదరాబాద్‌కు వచ్చి సొంతంగా గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. సీబీఎస్‌ఈకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఎక్కువగా చదువుతూ నాకు నేనే మెటీరియల్‌ తయారు చేసుకునేదాన్ని. చదివిన దాన్ని పలుమార్లు రివైజ్‌ చేసుకుంటూ గ్రూప్స్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాను.
అనుకున్న విధంగానే గ్రూపు -1, గ్రూపు -2లో మొదటి సారే విజేతగా నిలిచాను, గ్రూపు -2లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు, గ్రూపు -1 ఫలితాల్లో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టుకు ఎంపికయ్యాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం... జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే దీక్ష నన్ను విజేతగా నిలిపాయి. గ్రూపు -1 పోస్టుకు మీరెందుకు వచ్చారు, ప్రజలకు ఏవిధంగా సేవలందిస్తారని ఇంటర్వ్యూలో అడిగారు. చిన్నతనం నుంచి నాకు సమాజంపై ఉన్న ఆసక్తి, ప్రజలకు చేయాలనుకున్న సేవ, సిద్ధాంతాలను వివరించాను. ప్రతి ఒక్కరిలోనూ శక్తి ఉంటుంది. ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం పోరాటం చేస్తే విజేతలుగా నిలుస్తారు.

No comments:

Post a Comment