VRO 2012 ప్రశ్నాపత్రం: 91 నుండి 100 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Monday, 3 September 2018

VRO 2012 ప్రశ్నాపత్రం: 91 నుండి 100 ప్రశ్నలు


  • Q91. Y అను అతను ఉత్తర దిక్కునకు 30 మీటర్ల దూరము వెళ్ళి ఎడమ వైపుకు 50 మీటర్లు వెళ్ళెను. మరలా అక్కది నుండి ఎడమ వైపుకు తిరిగి 30 మీటర్లు వెళ్లెను. Y తన యధాస్ధానమునకు వెళ్ళవలయునన్న అతను ఏ దిశ నుండి ఏదిశకు ఎన్ని మీటర్ల దూరం వెళ్ళాలో కనుగొనండి.
    a) ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు 30 మీటర్లు
    b) పశ్చిమ దిశ నుండి తూర్పు దిశకు 50 మీటర్లు
    c) దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు 30 మీటర్లు
    d) తూర్పు దిశ నుండి పశ్చిమ దిశకు 50 మీటర్లు

  • Q92. భారత స్వాతంత్ర్యదినోత్సవం 1996లో శుక్రవారము అయితే 2000 సంవత్సరంలో ఏ వారము అవుతుంది?
    a) బుధవారం
    b) గురువారం
    c) శుక్రవారం
    d) ఆదివారం

  • Q93. B = 2, D = 4, F = 6, H = 8, J = 10, అయినచో ఈ క్రింది వానిలో సరియైనది ఎది?
    a) K = 12 L = 14
    b) L = 12 N = 14
    c) M = 12 N = 14
    d) I = 12 K = 14

  • Q94. ఏకత్వానికి భిన్నత్వంలాంటిదే, స్వార్ధానికి...................
    a) కలహం
    b) పరోపకారం
    c) అహంకారం
    d) తెలివి

  • Q95. ఓ ముసలి వ్యక్తిని చూపిస్తూ అనిల్ “అతని కుమరుడు నా కుమారునికి బాబాయి” అని చెప్పినాడు. అయినచో ఆ ముసలి వ్యక్తి అనిల్‌కు ఏమవును?
    a) తాత
    b) సోదరుడు
    c) బాబాయి
    d) తండ్రి

  • Q96. ఒక కోడ్‌లో HYDERABAD ని LCHIVEFEH గా రాస్తే ఆ కోడ్‌లో VIJAYAWADAని ఏ విధంగా రాస్తారు?
    a) ZMNCECAEHA
    b) ZMNCCEAEAH
    c) ZMNECEAEHE
    d) ZNMECEAEHA

  • Q97. ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తింపుము
    a) విద్యార్ధి – చదువు
    b) కార్మికుడు – శ్రమ
    c) గడ్డపార – వ్యవసాయము
    d) వైద్యుడు – చికిత్స

  • Q98. ఈ క్రింది ఇవ్వబడిన శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనుము
    6, 64, 8, 60, 10, 56, 12, ?
    a) 62
    b) 52
    c) 56
    d) 42

  • Q99. ఆంగ్ల అక్షరాల శ్రేణిలో R విలువ 4.5 గాను N విలువ 3.5 గాను నిర్దేశింపబడితే Z విలువ ఎంత?
    a) 6.75
    b) 6.5
    c) 6
    d) 15

  • Q100. ఒక పరిభాషలో P÷Q అనగా Pకి భార్య Q అని అర్ధం, P - Q అనగా P యొక్క సోదరి Q అని అర్ధం, P = Q అనగా P యొక్క కొడుకు Q అని అర్ధం అయిన L÷ M = Nలో Lకి N ఏమవుతాడు? 
    a) భర్త
    b) కొడుకు
    c) సోదరుడు
    d) తండ్రి

  • Q91. Answer: b
  • Q92. Answer: a
  • Q93. Answer: b
  • Q94. Answer: b
  • Q95. Answer: d
  • Q96. Answer: c
  • Q97. Answer: c
  • Q98. Answer: b
  • Q99. Answer: b
  • Q100. Answer: b

No comments:

Post a Comment