అరుణ ‘కిరణం’! - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Monday, 23 April 2018

అరుణ ‘కిరణం’!

గంట్యాడ, విజయనగరం: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తను పట్టువీడలేదు. చదివితే ఏదైనా సాదించవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుంది. కష్టపడి చదవడంతో ఇటీవల విడదల అయిన గ్రూపు-2 ఫలితాల్లో విజయం సాధించి, ఎక్సైజ్‌ ఎస్‌ఐగా ఎంపికైన లంక అరుణకుమారి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. గంట్యాడ మండలం పెణసాం గ్రామానికి చెందిన అరుణకుమారి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈమె 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేసింది. ఇంటర్‌, డిగ్రీ కోర్సు ప్రైవేటు కళాశాలల్లో పూర్తి చేసుకున్నారు. ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో 2012-13లో బెంగుళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఒకవైపు పని చేస్తూ, మరోవైపు పోటీ పరీక్షలు సిద్ధమయ్యేది. పని చేసే కంపెనీలో చాలీచాలని జీతాలు ఇచ్చినా.. కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు టెస్టులు పెట్టేవారు. వచ్చిన ఫలితాలు ఆధారంగా జీతాలు ఇచ్చేవారు. ఈ పద్ధతి సరైనది కాదని ఆమె భావించారు.
 
ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి పట్టుదలతో చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2013లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ కార్యదర్శి పరీక్షలో జిల్లాలోని మహిళా విభాగంలో మొ దటి ర్యాంకు సాధించారు. 2014లో పంచాయతీ కార్యదర్శి పోస్టు కూడా దక్కించుకున్నారు. రెవెన్యూ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరారు. డెంకాడ మండలంలోని వీఆర్‌వోగా పని చేస్తూ గ్రూపు -2కు సిద్ధమయ్యారు. ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన ఫలితాల్లో 300.7 మార్కులు రావడంతో ఎకైజ్స్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు.

No comments:

Post a Comment