టెన్త్, ఇంటర్ తర్వాత..విభిన్నంగా సాగండి
సంప్రదాయ కోర్సులే కాదు.. కొత్త రంగాలపై ఓ లుక్కేయండి..!
అధునాతన కోర్సులతో ఉద్యోగాలు పొందొచ్చు
జీవితంలో త్వరగా స్థిరపడొచ్చంటున్న నిపుణులు
టెన్త్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు ఉపాధి కోర్సుల కోసం అన్వేషిస్తున్నారు. ఎందులో చేరితే త్వరగా జీవితంలో స్థిరపడచ్చో తెలియక తికమక పడుతున్నారు. అయితే ఇదే సమయంలో చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంకా సంప్రదాయ కోర్సులనే పట్టుకుని వేలాడుతున్నారు. వాటి వల్ల భవిష్యత్‌లో చక్కటి ఉద్యోగాలు రావొచ్చు కానీ అందుకు చాలా సమయం పడుతుంది. దీనికితోడు బోలెడు ఆర్థిక భారం. నేటి ఆధునిక సమాజానికి అవసరమైన విభిన్న కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో చేరితే వేగంగా కొలువులు సంపాదించొచ్చు. ఆకర్షణీయమైన జీతంతో పాటు అందమైన జీవితాన్ని అందించే వివిధ కోర్సులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
హోమ్ సైన్స్
ఈ కోర్సుకు ఇప్పుడు చాల ఆదరణ ఉంది. వివిధ రకాల వ్య క్తుల అభిరుచులకు అనుగుణ ంగా ఇంటిని తీర్చదిద్దడమే హోం సైన్స్ ప్రత్యేకత. ఈ కోర్సు చేయడం ద్వారా అభ్యర్థుల్లో కళా త్మక, సృజనాత్మకత పెరుగుతుంది. ఆకర్షణీయమైన జీతం, ఇతర ప్రాంతాల్లో చక్కటి కోలువులు సులభంగా సాదించవచ్చు. ఇంటర్‌లో ఎంపీపీ, బైపీసీ కోర్సులు చదివిన వారు బీఎస్సీలో హోమ్‌సైన్స్ కోర్సు చదవోచ్చు. లేదా మూడేళ్ల డిప్లోమా కోర్సు ఉంది. విజయవాడ, సైఫాబాద్ కళాశాలలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఫైన్ ఆర్ట్స్
కళలపై మక్కువ ఉండేవారు ఈ కోర్సు చక్కగా చదవొచ్చు. ఈ కోర్సు ద్వారా చక్కటి నైపుణ్యం, సృజనాత్మకతతోపాటు చక్కటి ఉహాశక్తి ఏర్పడుతుంది. పదోతర గతి తరువాత నేరుగా ఫైన్ ఆర్ట్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌లో ఈ కోర్సు తీసుకుంటే డీగ్రీలో మూడేళ్ల కోర్సు చదవొచ్చు. ఇంటర్ తరువాత ఎన్‌ఎఎఫ్‌ఏయూ ప్రవేశపరీక్ష రాసి బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివే వీలుంది. దీనిని ఎస్‌బీఆర్ కాలేజ్‌ఆఫ్ మ్యూజిక్ అండ్‌డ్యాన్సింగ్ జవహార్‌లాల్‌నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, ఎస్వీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశా లలే కాకుండా చాలా సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేశాక ఆకర్షణీయమైన జీతంతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి.
జర్నలిజం
ఈ కోర్సు పూర్తిచేస్తే సోషల్ మీడియా నుంచి వివిధ దినపత్రికల్లో, టీవీ చానళ్లలో ఉపాధి అవకాశాలు పొందొచ్చు. ఇంటర్ తరువాత ఏ గ్రూపు చదివిన వారైనా మూడేళ్ల బీఏ జర్నలిజం, ఆపై పీజీ సెట్‌లో ర్యాంకు వస్తే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం రెండేళ్లు చదవాలి. ఈ కోర్సు వివిధ పత్రికలతో పాటు దాదాపు అన్ని యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి.
చార్టెడ్ అకౌంటెంట్
ఇంటర్‌లో సీఈసీ గ్రూప్ తీసుకున్న వారు కామర్స్‌పై పూర్తి గ్రిప్ సాధించొచ్చు. డీగ్రీ తరువాత అన్ని గ్రూపుల వారు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సుకు అర్హులే. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఆకౌంటెన్సీ ఆఫ్ ఇండియా అందిస్తోంది.
కంపెనీ సెక్రటరీ
డిగ్రీ, పీజీ పూర్తిచేశాక ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకుని ఈ ఉద్యోగాలు సాధించోచ్చు. ఈ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి వివిధ కంపెనీల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలతో కొలువులు సిద్ధంగా ఉంటాయి. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అందిస్తుంది.
నర్సింగ్
పదోతరగతి తరువాత ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సును ఒకేషనల్‌గా చదవొచ్చు. ఇంటర్‌లో బైపీసీ చదివితే నాలుగేళ్లు నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఓయూ మెడికల్ కళాశాల, రాజీవ్‌గాంధీ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నిమ్స్‌తో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు కుడా ఈ కోర్సులు అందిస్తున్నాయి.
సైకాలజీ
ఇంటర్ పూర్తిచేసిన అన్ని గ్రూపుల వారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో మూడేళ్ల సైకాలజీ కోర్సు ఎంచుకుని చదవొచ్చు. పీజీ సెట్‌లో ర్యాంకు వస్తే ఎంఏ సైకాలజీ కోర్సును దూర విద్యా విధానంలో ఎమ్మెసీ సైకాలజీ కోర్సు చేయొచ్చు.
న్యూట్రీషియన్, డైటీషియన్స్
ఇంటర్ తరువాత ఎంపీసీ ర్యాంకు ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ న్యూట్రీషియన్ ఫుడ్స్‌లో అడ్మిషన్ పొందాలి. ఈ కోర్సులను ఉస్మానియా యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ సంస్థలు అందిస్తున్నాయి.
ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ
పదోతరగతి పూర్తిచేసిన వారు ఈ డిప్లమో కోర్సులు చేయొచ్చు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వారు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇంటర్ తరువాత ఎంపీసీ కోర్సు తరువాత ఎన్‌ఎఫ్టీ, బ్యాచ్‌లర్ ఆఫ్ డిజైనింగ్‌లో నాలుగేళ్ల డిగ్రీ కుడా చేయొచ్చు. ఈ కోర్సులను నేషననల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూఢిల్లీ అందిస్తున్నాయి.
పారా మెడికల్ కోర్సులు
పదో తరగతి తర్వాత నేరుగా ఈ కోర్సులో చేరొచ్చు. ఇం టర్‌లో బైపీసీ చేసిన వారు కూడా ఈ డిప్లమో పారా మెడికల్ కోర్సులు చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, రేడియోగ్రఫీ, బ్లడ్‌బ్యాంక్ టెక్నీ షియన్, రేడియో థెరఫీ టెక్నీషియన్స్, అనస్థిషియా, మెడి కల్ ఇమేజింగ్ టెక్నిషియన్ వంటి కోర్సులు చేస్తే కొలువులు సులభంగా పొందొచ్చు. నిమ్స్‌గాంధీ, అపోలో, యశోద ఆసుపత్రుల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్ డిజైనర్
ఈ కోర్సు పూర్తి చేస్తే ఇళ్లు, కార్యాలయాలను అందంగా డిజైన్ చేయొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కోసం నేషనల్ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (అహ్మదాబాద్) ఇండియా, ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముంబై), జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్) నిర్వహించే ఎంట్రన్స్‌లు రాయాల్సి ఉంటుంది.
ట్రావెల్ అండ్ టూరిజం
ప్రస్తుతం చాలామంది విహారయాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా ట్రావెల్ అండ్ టూరిజం రంగానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ కోర్సుకు కుడా ప్రస్తుతం చక్కటి ఆదరణ లభిస్తోంది. దీనిద్వారా చక్కటి అవకాశాలను సులభంగా పొందొచ్చు. ఇంటర్‌లో ఏగ్రూపు చదివిన వారైనా వివిధ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగున్నరేళ్ల బ్యాచిలర్ ఆఫ్ టూరిజం కోర్సు చేయొచ్చు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ నిధమ్, నెల్లూరులోని ఐఐటీటీఎం వంటివి ఈ కోర్సులను అందుబాటులో ఉంచాయి.
విమానయాన రంగం
ఇంటర్‌లో ఎంపీసీ చదివిన వారు ప్రైవేటు లైసెన్స్ 2నెలలు, ప్రైవేటు పైలైట్ లైసెన్స్ 6నెలలు శిక్షణ తీసుకోవాలి. కమర్షియల్ ప్రైవెట్ పైలెట్ లైసెన్స్ కోసం 18నెలల శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ, తెలంగాణ ఏవియేషన్ అకాడమీ తదితర సంస్థలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. ఇది పూర్తిచేసిన వారు చాలా ఉపాధి అవకాశాలు పొందొచ్చు. ఆకర్షణీయమైన జీతం కూడా లభిస్తుంది.
అధునాతన కోర్సులపై దృష్టి సారించాలి
ఇంటర్ తరువాత అందరూ ఇంజినీరింగ్, మెడికల్ వైపు చూస్తున్నారు. ఇవి మంచి కోర్సులే అయినా.. బాగా ఖర్చుపెట్టాలి. చాలా సంవత్సరాలు చదవాలి. అప్పటికి గాని ప్లేస్‌మెంట్‌లు రావు. ప్రస్తుతం కాలవ్యవధి తక్కువగా ఉండే కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటికి పెద్దగా డబ్బులు అక్కర్లేదు. డిగ్రీ చదివిన వెంటనే ప్లేస్‌మెంట్ పొందొచ్చు. త్వరగా ఉపాధి అవకాశాలు లభించే అధునాతన కోర్సులపై యువత దృష్టి సారించడం ఉత్తమం.
- బొబ్బిలి రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, శృంగవరపుకోట
ఫ్యాషన్ రంగం విస్తరించింది
ప్రస్తుతం ఫ్యాషన్ రంగం విస్తరించింది. ఇందులో ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి కోర్సులతో ప్రత్యేక గుర్తింపుతో పాటు ఆకర్షణీయమైన జీతం పొందొచ్చు. పెద్దపెద్ద కంపెనీలు ఈ అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. చక్కటి దృక్పథం, ఆలోచనతో ఈ కోర్సులు చేస్తే జీవితం ఎంతో బాగుంటుంది.
- వై.విజయలక్ష్మి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు, శృంగవరపుకోట
ఇంటర్ తర్వాత విభిన్న కోర్సులు
ఇంటర్ తరువాత విభిన్నరంగాలకు చెందిన ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వైద్య కోర్సులు త్వరగా ఉపాధిని కల్పిస్తున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఆకర్షణీయమైన జీతాలతో పిలుస్తున్నాయి.
-ఎస్.అపర్ణ, సోనాల్‌జిస్ట్, ప్రసన్న, సర్జికల్ క్లీనిక్ ఎండీ, శృంగవరపుకోట
వైద్యరంగంలో బోలెడు అవకాశాలు
టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన యువతకు వైద్యరంగంలో బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చేసిన వారు బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, హెల్త్ అస్టిటెంట్స్ ఇలా చాలా కోర్సులు చేయొచ్చు. ఇవి చదివిన వెంటనే వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొలువులు పొందొచ్చు.
-డాక్టర్ మోపాడ జగదీష్, వైద్యాదికారి, పీహెచ్‌సీ, కొట్టాం
మూస పద్ధతులు వీడాలి
ఇంటర్ తరువాత వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జీవితంలో త్వరగా స్థిరపడొచ్చు. మంచి వేతనం కూడా పొందొచ్చు. మూస పద్ధతులు, మూస చదువులను వీడాలి. కొత్తరంగాల వైపు దృష్టి సారించాలి. సోషల్ వర్క్, వియానయానంలో కార్గో సెక్టార్‌లో కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు స్వచ్ఛంద సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలు పొందొచ్చు.
- గెదెల సత్తిబాబు, సోషల్‌వర్క్ విభాగపు అధిపతి, శృంగవరపుకోట
No comments:
Post a Comment